Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నుంచి గుంటూరు గల్లీ వ‌ర‌కు... డూప్లికేట్ కాస్మొటిక్స్!

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (12:04 IST)
మార్కెట్లో డూప్లికేట్ కాస్మోటిక్స్ వస్తువుల అమ్మ‌కాలు పెరిగిపోయాయి. ఢిల్లీ నుంచి ఈ న‌కిలీ స‌రుకు భారీగా వ‌స్తున్నా నిఘా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. 
 
గుంటూరు జిల్లా వ్యాప్తంగా కాస్మొటిక్స్ వస్తువులు డూప్లికేట్, కల్తీ రకం, డేట్ అయిపోయిన వస్తువులను భారీగా అమ్ముతున్నారు. కొన్ని కాస్మొటిక్స్ డూప్లికేట్ వస్తువులు సేమ్ టు సేమ్ త‌యారు చేసి మ‌ర్కెట్ లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. తినే వంట నూనెలు దగ్గర నుంచి వేసుకునే మందులు, ఇంట్లోకి వాడుతున్న ఫ్యాన్సీ వస్తువులు, కూల్ డ్రింక్స్ వరకు అన్ని డూప్లికేట్, కల్తీ, నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు. 
 
ఈ విషయం మీద జిల్లా అధికారులు విజిలెన్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వివిధ శాఖల వారికి ఎన్ని సార్లు సమాచారం అందించినా నిమ్మకు నీరెత్తినట్లు, పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నార‌ని  క్రైమ్ సర్వేలేన్స్ అండ్ ఇంటిలిజెన్స్ కౌన్సిల్ గుంటూరు జిల్లా శాఖ ఆరోపించింది.  
 
డిల్లీ నుంచి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి గల్లీ దాకా, ఈ కాస్మొటిక్స్ డూప్లికేట్ వస్తువులు విచ్చల విడిగా దిగుమతులు అవుతూ, బిల్లులు లేకుండా, కేవ‌లం ఊరు పేరుతో, దిగుమతులు చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.

ఈ విషయం ఆల్ ఇండియా సోషల్ సర్వీస్ కు సంబంధించిన క్రైమ్ సర్వేలేన్స్ అండ్ ఇంటిలిజెన్స్ కౌన్సిల్ గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గుణ్ణి దృష్టికి తీసుకు వెళ్లింది. ఆయన సానుకూలంగా స్పందించి కింది స్థాయి అధికారుల‌కు తెలియజేస్తాన‌ని చెప్పారు. కానీ, కాస్మొటిక్స్ డూప్లికేట్ వస్తువులు దిగుమతులు ఆగటం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments