Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద మందుబాబుల వీరంగం

Webdunia
ఆదివారం, 29 మే 2016 (21:27 IST)
గ‌న్న‌వ‌రం:  కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ ముందు మందు బాబులు వీరంగం సృష్టించారు. శ‌నివారం అర్ధ‌రాత్రి భర్తడే పార్టీ అంటూ కొంతమంది యువకులు ఎయిర్‌పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద హ‌ల్చ‌ల్ చేశారు. మందు కొడుతూ, చిందులు వేస్తూ, బాణా సంచా కాల్చి అల‌జడి సృష్టించారు. కానీ, అటు గ‌న్న‌వ‌రం పోలీసులు గాని, ఇటు ఎయిపోర్ట్ సెక్యూరిటీ గాని కిమ్మ‌న‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 
 
అంతమంది యువ‌కులు మందుకొట్టి స్వైర విహారం చేస్తుంటే, క‌నీసం సెక్యూరిటీ సిబ్బందిలో ఉలుకుప‌లుకు లేదు. త‌మ‌కేం ప‌ట్ట‌నట్లు వ్య‌వ‌హ‌రించారు. రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు మందుబాబులు ఎయిర్పోర్ట్ ముందు బాణసంచా కాలుస్తూ, మద్యం సేవిస్తూ, డ్యాన్స్‌లు వేస్తూ గందరగోళం సృష్టించినా ఎయిర్‌పోర్ట్ భధ్రతా సిబ్బందిగాని పోలీసులు గాని ఎవరు తమకేమి పట్టనట్లు వ్యవహరించారు. 
 
ఇపుడు న‌వ్యాంధ్రప్ర‌దేశ్ ఏర్పడింది. కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తికి సింగ‌పూర్, జ‌పాన్, మ‌లేసియా వంటి దేశాల నుంచి ప్ర‌తినిధులు ఈ గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ ద్వారానే రాక‌పోక‌లు సాగిస్తున్నారు. ఎవరైనా ఎయిర్‌పోర్ట్ లోకి వస్తే 100 ప్రశ్నలు ఐడి కార్డులు చూపాలంటూ... ఎయిర్‌పోర్ట సిబ్బంది వేధిస్తుంటారు. కానీ ప్రధాన ద్వారం వ‌ద్ద ఇంత జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. ఇక‌నైనా అలాంటిచోట ఇలాంటి గంద‌ర‌గోళాల‌ను అరిక‌ట్టాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments