Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ నుంచి సస్పెండ్ చేసినా బిల్లుపై తగ్గేది లేదు: డాక్టర్ కేవీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదనీ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను సస్పెండ్ చేసినా ఏమాత్రం వెనుకంజవేసే

Webdunia
బుధవారం, 27 జులై 2016 (14:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదనీ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను సస్పెండ్ చేసినా ఏమాత్రం వెనుకంజవేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ... పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ప్రత్యేక హోదా బిల్లును ఉపసంహరించుకునేది లేదన్నారు. ప్రత్యేక హోదాపై రేపు రాజ్యసభలో 2 గంటల పాటు చర్చించాలని బీఏసీలో నిర్ణయించామన్నారు. చర్చలో ప్రభుత్వం తరపున ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పనున్నారని తెలిపారు. 
 
అయితే కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల వాదన మరోలా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా బిల్లును ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు. కానీ, బిల్లును ప్రవేశపెట్టిన కేవీపీ మాత్రం అలాంటిదేమీ లేదనీ, బిల్లుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments