Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కలు మొరిగాయని వాటి యజమాని పళ్లూడగొట్టాడు

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:34 IST)
కుక్కలు మొరిగాయని యజమాని పళ్లూడగొట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్చారు. వివరాల్లోకి వెళితే చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి మేకలు కాస్తుంటాడు. సాయంత్రం మేకలను మేపు నుండి తోలుకువచ్చి, ఇంటి బయట సేదతీరుతున్నాడు. 
 
ఇంతలో కొంతమంది వ్యక్తులు ఆ దారిలో వెళ్తుంటే అతని కాపలా కుక్కలు వారిని చూసి మొరిగాయి. వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోయినా, ఇంటి ఎదురుగా నివసించే మల్లికార్జునాచారి, ఆయన భార్య సరిత, కొడుకు శ్రావణ్ కుక్కల అరుపులకు విసిగిపోయి రాళ్ల దాడికి దిగారు. కుక్కలపై రాళ్లు విసిరినందుకు కృష్ణయ్య కోప్పడటంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
గొడవ పెద్దదయి మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులు కృష్ణయ్య మీద రాళ్లు విసరడం ప్రారంభించారు. అవి ముఖానికి తగిలి గాయాలయ్యాయి. కొన్ని పళ్లు కూడా రాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకున్న తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మల్లికార్జునాచారి, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments