Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజంగా వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే : డాక్టర్ కుసుమ రావు

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (13:55 IST)
దివంగత ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనడం సరికాదని స్వర్గీయ ఎన్టీఆర్ భార్య బసవతారకం స్నేహితురాలైన డాక్టర్ కుసుమ రావు చెప్పుకొచ్చారు. అందరూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని చెప్తూంటారనీ... నిజానికి వెన్నుపోటు పొడిపించుకున్నది చంద్రబాబేనని ఆవిడ తెలిపారు. అప్పట్లో తెదేపాకి ఛరిష్మా మొత్తం ఎన్టీఆరే అన్న మాట నిజమేననీ... కాకపోతే అడ్మినిస్ట్రేషన్ మొత్తం చంద్రబాబే స్వయంగా చూసుకునేవారనీ... తెల్లవారుజామున 5 గంటలకల్లా చంద్రబాబు రాకపోతే ఆయనకు ఎన్టీఆర్ నుండి కబురు వచ్చేదన్నారు. ప్రభుత్వ పరంగా ఎదురయ్యే ఎన్నో క్లిష్టపరిస్థితులను సమర్థవంతంగా పరిష్కరించిన వ్యక్తి చంద్రబాబేనని చెప్పుకొచ్చిన ఆవిడ... ప్రతి కార్యకర్త పేరు చంద్రబాబుకు తెలుసునని చెప్పారు.
 
ఎన్టీఆర్‌కు ఏ ఆలోచన వస్తే అది జరిగిపోవాల్సిందేననీ... అయితే, తద్వారా ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా, చూసుకోవలసిన, సరిదిద్దవలసిన బాధ్యత చంద్రబాబుదేనని కుసుమ తెలిపారు. ఆ సమస్యలను ఎన్టీఆర్ పిల్లలు కానీ, మరో అల్లుడు కానీ సరిదిద్దే పరిస్థితే లేదని చెప్పారు. ఆ విధంగా అన్నీ తానై చంద్రబాబే చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. అలాంటి చంద్రబాబును... లక్ష్మీపార్వతి సూచన మేరకు ఎన్టీఆర్ అన్ని పదవులకూ దూరంగా పెట్టారని... నిజంగా చెప్పాలంటే వెన్నుపోటుకు గురైంది చంద్రబాబేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments