Publish Date: Mon, 01 Apr 2019 (10:31 IST)
Updated Date: Mon, 01 Apr 2019 (10:35 IST)
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని బాబు పాత్రే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు నైజమని సినీ నటుడు, వైకాపా నేత మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు సంస్కారం లేదని, కన్యాదానం చేసిన మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీని బలంవంతంగా తన వశం చేసుకున్నారని ఆరోపించారు.
రాంగోపాల్‌వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూస్తే చంద్రబాబు నిజస్వరూపం తెలుస్తుందన్నారు. మాట తప్పని వైఎస్.జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కులం, మతం, ప్రాంతం అంటూ విడగొడుతారని దీనిని ప్రజలంతా గమనించి వైఎస్ జగన్ గెలుపునకు కృషి చేయాలన్నారు.
జగన్ మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. అనుభవం అనేది ఏ ఒక్కరికీ ముందుగా ఉండదన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ పాలనను జగన్ మోహన్ రెడ్డి అందిస్తారని మోహన్ బాబు జోస్యం చెప్పారు.