Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేస్తున్న పనులను ప్రజలకు చెప్పటానికి నోరు రాదు కాని నోరు మాత్రం జారుతున్నారు: ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి

వచ్చే ఎన్నికలలో చంద్రబాబునే కాదు ఎమ్మెల్యేలను కూడా చూసి ప్రజలు ఓటేస్తారు.. 65 శాతంమంది ఎమ్మెల్యేల పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని లగడపాటి రాజగోపాల్ ఈ మధ్య ఇచ్చిన ఆంతరంగిక నివేదికపై చంద్రబాబు సీరియస్‌గానే ఉన్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. పనిచేయని ఎ

Webdunia
బుధవారం, 3 మే 2017 (04:55 IST)
వచ్చే ఎన్నికలలో చంద్రబాబునే కాదు ఎమ్మెల్యేలను కూడా చూసి ప్రజలు ఓటేస్తారు.. 65 శాతంమంది ఎమ్మెల్యేల పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని లగడపాటి రాజగోపాల్ ఈ మధ్య ఇచ్చిన ఆంతరంగిక నివేదికపై చంద్రబాబు సీరియస్‌గానే ఉన్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. పనిచేయని ఎమ్మెల్యేల మీద బాబు కసురుకోవడం అప్పుడే మొదలైపోయింది. ప్రభుత్వం చేసే మంచిపనులను ప్రజలకు చెప్పడానికి నోరు రాదు కానీ నోరు మాత్రం ఊరికే జారుతున్నారు అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలపై కటువుగా వ్యాఖ్యలు చేశారు.
 
పార్టీలో కొంతమంది నేతలు నోరు జారుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అమరావతిలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నా, వాటిని ప్రజలకు వివరించి చెప్పడంలో నాయకులు విఫలం అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆదేశించారు. జన్మభూమి కమిటీల తీరు బాగోలేదనే భావన కూడా వ్యక్తం అవుతోందని, తాగునీటి విషయంలో కూడా ప్రజల్లో అసంతృప్తి ఉందని,  ఈ అసంతృప్తి ఇంకా పెరగకుండా జాగ్రత్త పడాలని నాయకులకు ఆయన సూచించినట్లు సమాచారం.
 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments