Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చోడి చేతిలో రాయి అంటే ఇదే.. అణుదాడికి ఉత్తర కొరియా సిద్ధం

చివరకు అనుకున్నంతా జరుగుతోంది. రెండు ప్రపంచ యుద్ధాలకు యూరప్ సామ్రాజ్య కాంక్ష కారణం కాగా మూడో ప్రపంచ యుద్ధానికి ఆసియా కారణం అవుతున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్దన్న దురహంకారం, ఒక పిచ్చోడి చేతిలోని రాయి కలిసి ప్రపంచాన్ని మరో ప్రపంచ యుద్ధంలో

Webdunia
బుధవారం, 3 మే 2017 (04:16 IST)
చివరకు అనుకున్నంతా జరుగుతోంది. రెండు ప్రపంచ యుద్ధాలకు యూరప్ సామ్రాజ్య కాంక్ష కారణం కాగా మూడో ప్రపంచ యుద్ధానికి ఆసియా కారణం అవుతున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్దన్న దురహంకారం, ఒక పిచ్చోడి చేతిలోని రాయి కలిసి ప్రపంచాన్ని మరో ప్రపంచ యుద్ధంలోకి దింపుతున్నట్లు పరిణామాలు సూచిస్తున్నాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ త్వరలోనే అమెరికాపై అణు దాడి చేయనున్నారా దాడికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారా అనే ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. 
 
అమెరికా మిలిటరీ నిర్వహిస్తున్న డ్రిల్స్, రెచ్చగొట్టే పద్ధతులపట్ల కిమ్ ఆగ్రహంగా ఉన్నారని, త్వరలోనే అణుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఉత్తరకొరియా స్థానిక పత్రిక పేర్కొంది. అమెరికా ప్రధాన భూభాగాలను ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశం ఉందని వార్తను ప్రచురించింది. జపాన్, దక్షిణ కొరియాతో కలిసి అమెరికా దళాలు నిర్వహిస్తున్న యుద్ధ సన్నాహాలే దీనంతటికీ కారణమని పత్రిక పేర్కొంది. 
 
ఉత్తర కొరియా తాజా ప్రకటనతో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింతదిగజారాయి. అమెరికాను ధ్వంసం చేయగల టెక్నాలజీ ఉత్తరకొరియా వద్ద ఉందని, జాగ్రత్తగా ఉండాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. చిన్న దేశాల మీదికి ఒంటికాలిమీద లేచి ఉరికే అమెరికా కూడా ఉత్తర కొరియా వద్ద ఉన్న అణుబాంబులను చూసే దాడి చేయడానికి భయపడుతోందని తెలుస్తోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments