Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న కొండా సురేఖ.. వైభవంగా దీపావళి ఆస్థానం (Video)

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (15:59 IST)
Konda surekha
తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శనానంతరం వేదాశీర్వచనం, ప్రసాదం అందించారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీత, కూతురు, అల్లుడు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. యాంకర్ ప్రదీప్, నటుడు ప్రేమ కూడా అదే రోజు దర్శనం చేసుకున్నారు. దీంతో దీపావళిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని ఎక్కువ సంఖ్యలో సెలబ్రిటీలు దర్శించుకున్నారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు హాజరైన వైభవంగా జరిగిన కార్యక్రమంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకలు నిర్వహించారు. 
 
ప్రముఖులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కిరణ్ స్వామి, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments