Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య చాలా మంచిది : దివ్వల మాధురికి భర్త సర్టిఫికేట్

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (16:44 IST)
తన భార్య దివ్వెల మాధురి ఎంతో మంచిదని విదేశాల్లో ఉంటున్న ఆమె భర్త దివ్వల మహేశ్ చంద్రబోస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆమె సన్నిహితురాలు దివ్వల మాధురిల అడల్టెన్ రిలేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. సినిమా స్టోరీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ట్విస్టింగ్ ఎపిసోడ్స్ ఈ వ్యవహారంలో చోటు చేసుకున్నారు. ఈ క్రమంలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని తనపై ట్రోల్స్ చేస్తున్నారంటూ మనస్తాపంతో ఆగి ఉన్న కారును తన కారుతో ఢీకొట్టించి ఆత్మహత్యాయత్నానికి దివ్వెల మాధురి ప్రయత్నించారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, చికిత్స ముగియడంతో మంగళవారం సాయంత్రం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఈ అంశంపై అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్వల మహేశ్ చంద్రబోస్ తాజాగా స్పందించారు. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదన్నారు. కానీ, మాధురి పట్టుదలతో వైకాపాలో చేరడానికి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. కానీ, తన భార్యపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆమె రాజకీయంగా ఎదుగుతుందనే కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మాధురి కూడా మీడియాతో మాట్లాడారు. దువ్వాడ వాణి రాజకీయ కోణంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆమె చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments