Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ : జగన్‌

poor
Webdunia
బుధవారం, 6 మే 2020 (10:47 IST)
జూలై 8వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. జూలై 8వ తేదీలోపు పట్టాల పంపిణీకి సబంధించి మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇంకా లబ్ధిదారులు మిగిలిపోయారని తన దృష్టికి వచ్చిందని, మరో 15 రోజులు సమయం ఇచ్చి, లబ్ధిదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబధించి కొందరు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోలేదని, అర్హులైన 
 
వారు దరఖాస్తు చేసుకునేందుకు మరో 15 రోజులు గడువు ఇవ్వాలని అధికారులను సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.  రేపటి నుంచి 21 వరకు జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.

అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదనే మాట ఎక్కడా రాకూడదన్నారు. వచ్చే అక్టోబర్‌ నాటికి రైతులకు డెబిట్‌ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతులు డబ్బు తీసుకోవచ్చు లేదా కార్డు ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుక్కోవచ్చని తెలిపారు.

రైతులకు క్రెడిట్‌ కార్డు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఇ-క్రాపింగ్‌ చేస్తారని పేర్కొన్నారు. ఇ-క్రాపింగ్‌ ఆధారంగా రైతులకు బ్యాంకులు కచ్చితంగా రుణాలివ్వాలని తెలిపారు.

ఆ రుణంపై వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందన్నారు. అకాల వర్షాలు రావొచ్చని సమాచారం ఉందని, రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments