Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - విచారణలో కదలిక...

వరుణ్
బుధవారం, 3 జులై 2024 (16:57 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. 
 
కాగా, జగన్ కేసులపై గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందని విన్నవించడంతో ఈ కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

భారాస ఎమ్మెల్సీ కె.కవితకు మరోమారు షాక్.. కస్టడీ పొడగింపు!! 
 
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు మరోమారు షాకిచ్చింది. ఆమెకు జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడగించింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్న కవితకు బుధవారం జ్యూడీషియల్ కస్టడీ ముగిసిపోయింది. దీంతో ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. 
 
ఈ కేసు విచారణనను రౌస్ అవెన్యూ కోర్టు జూలై 25వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు ఆమె కస్టడీని పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో కవితో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతో పాటు మరికొందరు అరెస్టయి వున్న విషయం తెల్సిందే. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌లను కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు తిరస్కరించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

సీరియస్ అయిన నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా

జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డా.. వద్దు రద్దు చేయండి..!

మట్కా టీజర్ విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్‌లో లాంచ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం