Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, ఇక డైరెక్ట్‌గా స్వామివారి దర్శనం, ఎలా సాధ్యం?

Webdunia
గురువారం, 14 మే 2020 (21:55 IST)
కరోనా వైరస్ వ్యాపిస్తున్న పరిస్థితుల్లో టిటిడి కొన్ని నిర్ణయాలను తీసుకుంటోంది. భక్తులు గుంపులుగుంపులుగా తిరగకుండా ఉండేందుకు, క్యూ కాంప్లెక్స్‌లలో గంటల తరబడి వేచి ఉంచకుండా నేరుగా స్వామివారి దర్సనాన్ని కల్పించేందుకు కసరత్తు ప్రారంభించింది.
 
గతంలోలా క్యూ కాంప్లెక్స్‌లో గంటల తరబడి కూర్చుని.. ఎప్పుడు దర్సనానికి పంపిస్తారా అని ఎదురుచూసే పరిస్థితి నుంచి తాత్కాలికంగా భక్తులకు ఉపశమనం కలుగనుంది. దర్సన విధివిధానాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు టిటిడి ఉన్నతాధికారులు. 
 
అందులో భాగంగా సామాజిక దూరం పాటిస్తూ క్యూకాంప్లెక్స్ లోకి వచ్చేవారు నేరుగా స్వామి వద్దకు వెళ్ళి దర్సనం చేసుకుని బయటకు రావచ్చు. త్వరితగతిన దర్సనం అవ్వడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామివారిని దర్సించుకునే అవకాశం ఇది. 
 
అయితే టైమ్ స్లాట్ కింద వచ్చిన భక్తులకు వెంటనే దర్సనం కల్పించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇదంతా తాత్కాలికమే. అయితే దర్సనానికి వచ్చే భక్తులు మాత్రం ఖచ్చితంగా చాలా త్వరగా దర్సనం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments