Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో మళ్లీ వింత శబ్ధాలు.. ఏంటా అని చూస్తే..?

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (20:15 IST)
చిత్తూరు జిల్లాలో గతంలో వింత శబ్ధాలు మొదలయ్యాయి. తాజాగా చిత్తూరులో వింత శబ్ధాలు మొదలైనాయి. ఆ శబ్ధం ఎక్కడా అని తెలిస్తే షాకవ్వక తప్పదు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాకాల మండలం బండకాడపల్లిలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. బండకాడపల్లిలో నివాసం ఉంటున్న మురళి నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎప్పుడూ లేని విధంగా వింతైన శబ్దాలు రావడం మొదలైంది.  
 
అయితే చుట్టు పక్కల నుంచి ఏదో జంతువులు శబ్దాలు చేస్తున్నాయనుకుని.. నిద్రలోకి జారుకున్నాడు. కానీ రాను రాను ఆ శబ్దాలు ఎక్కువ కావడం మొదలయ్యాయి. ఎంతసేపటికి ఆ శబ్దాలు ఆగకుండా వస్తుండడంతో ఇంటిలోని వారిని కూడా నిద్ర లేపాడు. దీంతో ఇంటికి చుట్టుపక్కల ప్రదేశాలను గాలించడం మొదలుపెట్టారు. కానీ ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించలేక పోయారు. మళ్లీ ఇంట్లోకి వచ్చి నిద్రలోకి జారుకున్నారు.
 
మళ్ళీ శబ్దాలు వినిపించడం మెుదలైంది. గమనించిన మురళి ఇంటిలో వేసిన వరి ధాన్యం మూటలను మధ్య అన్వేషణ కొనసాగించాడు. ఇంతలో మూటల మధ్యలో అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన మురళి చుట్టు పక్కల వారిని పిలిపించి విగ్రహాన్ని బయటకు తీశాడు. వెంటనే అమ్మవారికి చుట్టుపక్కల వారు పూజలు చేయడం మొదలెట్టారు.
 
అర్ధరాత్రి అమ్మవారు ప్రత్యక్షం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక అడుగు ఎత్తు రెండు కిలోల బరువు ఉన్న అమ్మవారి పంచలోహ విగ్రహానికి గ్రామంలో గుడి నిర్మించేందుకు ప్రభుత్వం, ప్రజల సహకారం కావాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments