Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాహసీల్దారు విజయారెడ్డిని ఎవరు చంపారు? ఎమ్మెల్యేనా? రైతా?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (09:45 IST)
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య ఇపుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విజయారెడ్డిని సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ కూడా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన సంచలనం రేపింది. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో టేప్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆడియో ఇద్దరు స్థానికుల మధ్య జరిగిన సంభాషణగా తెలుస్తుండగా, గౌరెల్లి భూముల వివాదంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా ఉన్నారన్న ప్రస్తావన వచ్చింది.
 
స్థానిక ఎమ్మెల్యే రైతుల నుంచి రూ.30 లక్షలు తీసుకున్నారని, అందులో విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్‌కు చెందిన రెండు, మూడు లక్షలు ఉంటాయని అనుకున్నారు. డబ్బులు నొక్కేసే అధికారులకు ఇలా కావాల్సిందేనని చెప్పుకున్నారు. 
 
ఈ ఆడియో టేప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కాగా, గౌరెల్లి భూముల విషయంలో తనకు ప్రమేయముందనడాన్ని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. సురేష్ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments