Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపాటు నుంచి తెరాస ఎమ్మెల్యే జస్ట్ ఎస్కేప్... ఏపీలో ఐదుగురు మృతి

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (18:23 IST)
ఒకవైపు దేశం యావత్తూ కరోనా వైరస్‌తో వణికిపోతోంది. అయితే, గురువారం ఉన్నట్టుండి దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలంగాణా రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పాటు... పిడుగులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో ఈ వర్షం భారీగా ఉండగా, మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ.. కరోనా వైరస్ భయం మరింతగా ఎక్కువైంది. చల్లనివాతావరణంలో ఈ వైరస్ మరింతగా విజృంభింస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. 
 
అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన దేవకొండ ఎమ్మెల్యేతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు పిడుగుపాటును నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఉన్న పెంట్‌హౌస్ అంచును తాకుతూ పిడుగు పడింది. ఆ సమయంలో ఎమ్మెల్యేతో ఆయన కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నట్టు సమాచారం. 
 
మరోవైపు, ఉపరితల ఆవర్తన ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ప్రయాణించనుంది. దీని ప్రభావం కారణంగా తెలంగాణలో గురు, శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
 
ఇదిలావుంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గురువారం కురిసిన‌ ఆకాల వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులుప‌డి ఐదుగురు మృతిచెందారు. దగదర్తి మండలం చెన్నూరులో పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెల కాపరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా బోగోలు మండలం భాస్కరగిరివారి కండ్రిలో పిడుగుప‌డి పెంచలరెడ్డి అనే 65 ఏళ్ళ వ్యక్తి మృతిచెందాడు. అల్లూరు మండలం పడమర గోగులపల్లిలో సుబ్బారావు అనే 54 ఏండ్ల‌ వ్యక్తి పిడుగుపాటుకు బ‌ల‌య్యాడు. ఇక‌, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. భారీ వర్షానికి చేతికి వచ్చిన పంటలు కూడా నేలపాల‌య్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ "ఓజీ" నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఎపుడో తెలుసా?

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments