Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్షేమ పథకాలకు వారి పేర్లు పెట్టడం భేష్: పవన్ కల్యాణ్ కితాబు

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (14:02 IST)
ప్రముఖ సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు, ఈ చర్య భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
 
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం పేర్లను మార్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. అబ్దుల్ కలాం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ కార్యక్రమాలలో భాగం కావడం సంతోషంగా వుందన్నారు. 
 
తాజా ప్రకటనలో గత ప్రభుత్వం పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టే విధానాన్ని విమర్శించారు. ఈ కొత్త విధానం విద్యార్థులలో విలువలు, స్ఫూర్తిని నింపడానికి సహాయపడుతుందని ఉద్ఘాటించారు. విద్యా బహుమతి పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలు, బ్యాగులు, షూలు, సాక్స్‌లు వంటి నిత్యావసర వస్తువులను అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని పవన్ అన్నారు. విద్యా పథకాలకు సర్వేపల్లి పేరు, ఆపదలో ఉన్నవారికి భోజనం పెట్టడంలో దాతృత్వాన్ని చాటుకున్న మహిళ డొక్కా సీతమ్మ గౌరవార్థం మధ్యాహ్న భోజన పథకం పేరును ‘అపర అన్నపూర్ణ’గా మార్చడాన్ని కూడా కళ్యాణ్ కొనియాడారు.
 
అంతేకాకుండా, "మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పిలవబడే డాక్టర్ అబ్దుల్ కలాం పేరు మీద ప్రతిభా పురస్కారాలను ప్రవేశపెట్టడం యువతలో ఆశయాన్ని పెంపొందిస్తుందని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments