Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో రేణూ దేశాయ్ భేటీ.. ఎందుకో తెలుసా?

Advertiesment
Renu Desai is going to meet Pawan Kalyan

వరుణ్

, ఆదివారం, 28 జులై 2024 (10:12 IST)
ఏపీలో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకోనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
ఈ సందర్భంగా పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై ఇరువురు చర్చించారు. తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ని నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు సురేఖ. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసును రేణు దేశాయ్‌కి కొండా సురేఖ స్వయంగా అలంకరించారు. 
 
భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను కొండా సురేఖకు రేణు దేశాయ్ వివరించారు. ఈ సంగతిని పక్కనబెడితే.. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వా రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. 
 
ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారని తెలుస్తోంది. వచ్చే వారం ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి‌ని కలిసే అవకాశమున్నట్లు సమాచారం. ఆనం‌తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కూడా ఆమె భేటీ కానున్నారనే వార్త వైరల్‌గా మారింది. విడాకులు తర్వాత తొలిసారి ఇలా అఫీషియల్‌గా పవన్‌ను రేణుదేశాయ్ కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లోనూ, ఫ్యాన్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి బాలక్రిష్ణ ఫుడ్ ఏమి తింటాడో తెలుసా !