Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌వంబ‌రు 4న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (20:02 IST)
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 4వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆస్థానం జ‌రుగ‌నుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.
 
న‌వంబ‌రు 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం :
దీపావళి ఆస్థానం సంద‌ర్భంగా ఆలయంలో న‌వంబ‌రు 2వ‌ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆన‌వాయితీ. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments