Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్యా... ఏపీని వణికిస్తున్న తుఫాను తీరం దాటింది....

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (11:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తూ వచ్చిన తుఫాను మంగళవారం ఉదయం తీరం దాటింది. విశాఖపట్టణం, నర్సాపూర్ మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
 
కాగా, గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొచ్చిన వాయుగుండం కాకినాడ సమీపంలో భూభాగాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు. తీరం దాటిన అనంతరం ఇది తొలుత వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా మారుతుందని పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
వాయుగుండం ప్రభావంతో కోస్తా, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ తుఫాను ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments