Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

సెల్వి
గురువారం, 19 డిశెంబరు 2024 (22:22 IST)
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను గుర్తించడంలో ఎవరు కీలక పాత్ర పోషించారనే దానిపై చర్చ అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతూ, సున్నితమైన అంశాలను ప్రస్తావించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మంచి ఉద్దేశ్యంతో చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం వుందని సూచించారు. 
 
వ్యవసాయంపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియాలో వక్రీకరించారని, వ్యవసాయాన్ని భారంగా ముద్రవేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పాలనలో డాక్టర్ అంబేద్కర్‌కు తగిన గుర్తింపు లభించలేదని చంద్రబాబు నాయుడు ఎత్తి చూపారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత మాజీ ప్రధాని వి.పి. సింగ్‌కు దక్కుతుందన్నారు.
 
"అంబేద్కర్‌ను నిజంగా ఎవరు గుర్తించారనే దానిపై చర్చ జరగాలి" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్ ఎంపీల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది గాయపడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments