Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి కూతురితో యువకుడిని ఏకాంతంగా చూసిన తండ్రి, వెంటపడ్డాడు...

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (19:20 IST)
తను కష్టపడినా తన కుమార్తెను మాత్రం మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు ఆ తండ్రి. కూతురి కోసం పస్తులుండి మరీ డబ్బులు చేర్చాడు. కొత్త సంవత్సరంలో పెళ్ళి చేద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ కుమార్తె మాత్రం ఒక యువకుడితో ప్రేమలో పడిపోయింది. అతడితో శారీరకంగా కూడా కలిసింది. దాన్ని కళ్ళారా చూసిన తండ్రి ఆ యువకుడిని అతి దారుణంగా చంపేశాడు.
 
కాకినాడ ప్రతాప్ నగర్‌కు చెందిన రాజయ్యకు ఒక్కగానొక్క కుమార్తె మరియ. ఇంటర్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. రాజయ్య భార్య అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితమే మృతి చెందింది. ప్రైవేటు ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు రాజయ్య. అయితే ఉన్నది ఒకే కూతురు కావడంతో ఆమెను మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నాడు. 
 
సరిగ్గా అన్నం తినకుండా డబ్బులు చేర్చిపెట్టాడు. అయితే రెండు నెలలుగా మరియ తన ఇంటికి సమీపంలోని రాము అనే యువకుడితో పరిచయం పెట్టుకుంది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. రాముతో కుమార్తె చనువుగా వుండటాన్ని చూసి హెచ్చరించాడు రాజయ్య. అయినా మారలేదు.
 
రామును కూడా పిలిచి ఇకపై తమ ఇంటికి రావద్దని చెప్పాడు. అయినా ఇద్దరూ మారలేదు. వాచ్‌మెన్ డ్యూటీ కోసం రెండురోజుల క్రితం రాత్రి వెళ్ళగా మరియ, రాము ఇద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉన్నారు. దీన్ని కళ్ళారా చూశాడు రాజయ్య. ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ఇంటి నుంచి పారిపోతున్న రామును వెంబడించి నడిరోడ్డుపై కర్రతో తలపై గట్టిగా బాదాడు. దీంతో రాము అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. రాజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

హాలీవుడ్‌తో పోటీకి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం: హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments