Webdunia - Bharat's app for daily news and videos

Install App

దండుపాళ్యం బ్యాచ్... 4 నెలలు భరిద్దాం, అందుకే తెదేపాతో కలిసి పోటీ: పవన్ కల్యాణ్

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (21:59 IST)
విశాఖ హార్బరులో అగ్నిప్రమాదానికి దగ్ధమైన బోటు యజమానులైన మత్స్యకారులకు, వారి కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం బోట్లు నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో మాట్లాడారు.
 
''నేను ఇచ్చిన డబ్బు పూర్తిగా బాధితులకు జరిగిన నష్టాన్ని తీర్చగలను అని నేను అనను. కానీ కష్టం వస్తే ఆదుకునేందుకు మీకోసం జనసేన వుంది, వీరమహిళలు వున్నారు, పవన్ కళ్యాణ్ వున్నాడు. నేను బుక్ చేసుకున్న విమానాన్ని బెదిరించి వెనక్కి పంపేశారు. నేను వస్తున్నాను అంటే వైసిపి నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారు. ఆంధ్రలో అడుగుపెడుతున్నానంటే చాలు విమానాలు ఆపుతారు, రోడ్డుపైన రాకుండా దిగ్బంధిస్తారు. నేను వస్తున్నానంటే ఎందుకు అంత భయం?
 
దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైంది. వైసీపీ రౌడీ మూకలు తయారయ్యారు. మనం అధికారంలోకి వచ్చాక ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తాం, చీకటిగా ఉంది, ఇక్కడ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తాం, ఆడవారు అర్థరాత్రి ధైర్యంగా తిరిగే పరిస్థితులు తీసుకొస్తాం. వైసీపీని ఓడించడానికి ఛాన్స్ తీసుకోదలచుకొలేదు. అందుకే టీడీపితో పొత్తు పెట్టుకున్నాము, రేపటి రోజున 5 వేల తేడాతో సీట్ ఓడిపోకూడదు, గెలిస్తే 25 వేల మెజారిటీతో గెలవాలి." అని విశాఖ మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments