Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ఠాగూర్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (11:28 IST)
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం ఒరిస్సా - ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వాయుుగుండం ఒరిస్సాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైవుంది. ఇది వాయువ్య దిశగా కదిలి తీరం దాటనుంది. 
 
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 
 
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. నాగావళి నదిలో వరద ప్రభావం క్రమంగా పెరుగుతోంది. 
 
మరోవైపు, తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో 08942 - 240557 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఏవైనా అత్యవసరాలు ఎదురైతే వెంటనే ఈ నంబర్‌ను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments