ముంచుకొస్తున్న మోచా తుఫాను.. ఆ రాష్ట్రాలకు అలెర్ట్

Webdunia
గురువారం, 4 మే 2023 (11:18 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుఫాను గండం పొంచివుంది. దీంతో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడివుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ నెల ఆరో తేదీన బంగాళాఖాతం ఆగ్నేయ దిశగలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి మోచాగా నామకరణం చేశారు. ఈ తుఫాను ఎనిమిదో తేదీ నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావం కారణంగా ఒడిశా, ఏపీపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని తెలిపింది. 
 
అలాగే, హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, అమెరికా వాతావరణ కేంద్రం గ్లోబర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌ కేంద్రాలు అంచనా వేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments