Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా దూసుకొస్తున్న వాయుగుండం.. గంటకు 32 కిమీ వేగంతో ప్రయాణం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:37 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీవనం శరవేగంగా దూసుకొస్తుంది. ఇది గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని, ఇది శనివారం ఉదయానికి తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
వచ్చే 24 గంటల్లో అది జవాద్ తుఫానుగా మారే ప్రమాదం ఉందని తెలిపింది. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర - ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం ఉదయం 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
మరోవైపు తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు విశాఖ మున్సిపల్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పోలీస్, రెవెన్సూ, ఇరిగేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారంతా కలిసి పని చేసేలా ఒక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments