ఏపీలో మరోమారు కర్ఫ్యూ పొడగింపు... ఈ నెల 20 వరకు..

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా, ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెల 20వ తేదీ వరకు పొడగించింది. 
 
ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్‌ మరో 10 రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
అయితే కర్ఫ్యూ సడలింపు సమయంలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ వివిధ అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం కల్పించింది. 
 
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు నడవనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూ విధించింది. మే 31తో గడువు ముగియడంతో జూన్‌ 10 వరకు కర్ఫ్యూను పొడిగించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments