Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో నేరాలు తగ్గుముఖం

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (15:25 IST)
గత ఏడాదితో పోల్చితే 2020లో విజయవాడలో 12శాతం కేసుల సంఖ్య తగ్గిందని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. చోరీలకు సంబంధించి 78.77 శాతం కేసుల్లో సొత్తును రికవరీ చేసినట్లు చెప్పారు. 

సైబర్ నేరాల్లోనూ 36 శాతం సొత్తును రికవరీ చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణకు సంబంధించి కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా నేరస్థులకు శిక్ష పడేలా చేస్తున్నట్లు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 11.19 శాతం తగ్గాయని.. 55 శాతం కేసుల్లో దోషులకు శిక్షలు పడేలా చేశామన్నారు.

2020లో విజయవాడ నగరంలో మొత్తంగా 15,382 కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని.. ప్రమాదాలు తగ్గేందుకు లాక్‌డౌన్ కూడా ఒక కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఏడాది మొత్తంలో 75 గంజాయి కేసులు నమోదు చేసి 166 మందిని అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. అందులో రూ.1.60 కోట్ల నగదు, 4,135.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువకులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

డిసెంబరు నెలలో యాంటీ డ్రగ్ డ్రైవ్‌లో భాగంగా 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నగర వ్యాప్తంగా 1,231 లిక్కర్ కేసులు నమోదు చేసి 1,02,957 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాదిలో కొత్తగా 79 రౌడీషీట్లు తెరిచామని.. పటమట గ్యాంగ్ వార్ కేసులో 61 మందిని అరెస్టు చేసి, 25 మందిపై రౌడీ, సస్పెక్ట్ షీట్లు తెరిచినట్లు వివరించారు. ఆపరేషన్ ముస్కాన్‌ పేరుతో మూడు దశల్లో 424 మంది చిన్నారులను గుర్తించినట్లు చెప్పారు. కరోనా పరిస్థితుల్లో పోలీసులు సమర్థంగా పనిచేశారని కొనియాడారు.

వలస కార్మికులు, కొవిడ్ బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ద్వారా సహాయం అందించామన్నారు. ఈ క్రమంలో 385 మంది పోలీసులు కరోనా బారిన పడగా.. ఇద్దరు మృతి చెందినట్లు వెల్లడించారు. నిరంతర నిఘాతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

డయల్ 100కి ఫోన్ వచ్చిన వెంటనే గరిష్ఠంగా 6 నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకుంటున్నట్లు సీపీ చెప్పారు. న‌గ‌రంలో క‌మ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని.. సైబర్‌ మిత్రల సహకారంతో సత్ఫాలితాలను సాధిస్తున్నట్లు సీపీ శ్రీనివాసులు వెల్లడించారు.

సైబర్ మిత్రను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాల్సి వుందన్నారు. ఈ ఏడాది కొన్ని ప్రతిష్టాత్మక అవార్డులు విజయవాడ పోలీసుశాఖకు లభించాయని తెలిపారు. సీసీ టీవీ నెట్‌వర్క్‌, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. మైక్రో ఫైనాన్స్, ఆన్‌లైన్‌ ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకొని విష వలయంలో చిక్కుకొని నష్టపోవద్దని సీపీ హెచ్చరించారు.
\
దీనికి సంబంధించి మొత్తం 70 నుంచి 80 యాప్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. మీడియా స‌మావేశంలో డీసీపీ విక్రాంత్‌పాటిల్, అడ్మిన్ డీసీపీ మేరి ప్రశాంతి, ఐఎస్‌డ‌బ్ల్యూ డీసీపీ ఉద‌య‌రాణి, ప‌లువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments