Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ శిఖండి రాజకీయాలు.. నారాయణ

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో శిఖండి పాత్రను పోషిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ-ఫ్రంట్ లాంటిదని నారాయణ ఎద్దేవా చేశా

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (16:59 IST)
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో శిఖండి పాత్రను పోషిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ-ఫ్రంట్ లాంటిదని నారాయణ ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన తరుణంలో కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాటం చేయాలని సవాల్ విసిరారు. 
 
ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల వద్ద కేసీఆర్ మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని. తెలంగాణను వ్యతిరేకించిన వారికే కేబినెట్‌లో చోటు కల్పించారని నారాయణ చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి తథ్యమని నారాయణ జోస్యం చెప్పారు. 
 
బీజేపీ పతనం ప్రారంభమైందని చెప్పేందుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే నిదర్శనమని నారాయణ వెల్లడించారు. పూర్వవైభవం కోసం బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని.. చివరికి హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహకారాన్ని కూడా కోరారని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments