Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు ఓ వేస్ట్ ఫెలో... వైకాపా నేత బొత్స ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి రైల్వేజోన్ తేలేని అసమ

Advertiesment
botsa satyanarayana
, ఆదివారం, 10 జూన్ 2018 (17:05 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శల వర్షం కురిపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి రైల్వేజోన్ తేలేని అసమర్థుడు చంద్రబాబు అని మండిపడ్డారు.
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో లేనిపోని అసత్య వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత నాలుగేళ్లలో సాధించింది అవినీతి తప్ప ఏమీ లేదన్నారు. ఏపీలో పాలనను చంద్రబాబు గాలికి వదిలేసి, ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే దినచర్యగా పెట్టుకున్నారని విమర్శించారు. 
 
టీడీపీ పాలనలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి విషయంలో బీహార్‌ను ఏపీ మించిందిపోయిందని, ఏపీలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. మట్టి, ఇసుక, మద్యం,మాఫియాను రాష్ట్రంలో పెంచి పోషిస్తున్నారని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉలి - సుత్తి సాయంతో పన్ను పీకిన నకిలీ వైద్యుడు.. ఎక్కడ?