Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపి ఎంపీలతో భాజపా కుమ్మక్కు... యనమల ఆరోపణలు

వైసీపి ఎంపీలతో భాజపా కుమ్మక్కయ్యిందంటూ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ... " ఏప్రిల్ 6న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇచ్చిన రాజీనామా లేఖలు స్పీకర్ ఫార్మెట్ లోనే ఉన్నాయని వారే తెలిపారు. లేఖలను మీడియాకు విడుదల చేశారు కూడా. ఇది జర

Advertiesment
Yanamala Ramakrishnudu
, గురువారం, 7 జూన్ 2018 (22:16 IST)
వైసీపి ఎంపీలతో భాజపా కుమ్మక్కయ్యిందంటూ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ... " ఏప్రిల్ 6న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇచ్చిన రాజీనామా లేఖలు స్పీకర్ ఫార్మెట్ లోనే ఉన్నాయని వారే తెలిపారు. లేఖలను మీడియాకు విడుదల చేశారు కూడా. ఇది జరిగిన 2 నెలల తరువాత మే 5న ఎంపీలను రాజీనామాల నిర్దారణపై విచారణకు స్పీకర్ పిలిపించుకున్నారు. రాజీనామాలపై ఆలోచించుకునేందుకు వారికి మరికొంత సమయం ఇవ్వడం, ఇదంతా రాజీనామాలపై జాప్యం చేయడంలో భాగమే.
 
రెండవసారి మే 5న వారిని రీ-కన్ఫర్మేషన్ లెటర్స్ ఇవ్వాలని స్పీకర్ కోరడం 3వ నిర్దారణ కాగా, ఇవన్నీ ఉపఎన్నికలు నివారించేందుకు జరుగుతున్న తాత్సారంలో ఎత్తుగడలే. రీ-కన్ఫర్మేషన్ లెటర్స్ ఇవ్వాలని స్పీకర్ కోరడం పార్లమెంటరీ ప్రొసీజర్స్‌లో ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్‌కు విరుద్ధం. మొదట అందించిన రాజీనామా లేఖలు ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ లోనే ఉన్నప్పుడు, రీ-కన్ఫర్మేషన్ లెటర్స్ అడగాల్సిన అవసరం ఏమిటి..? ఎంపీలు ఇచ్చిన రీ-కన్ఫర్మేషన్ లెటర్స్ పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం లేవు. మొదట ఇచ్చిన లెటర్స్ సక్రమంగా ఉండి, రెండవసారి ఇచ్చిన రీ-కన్ఫర్మేషన్ లెటర్స్‌లో రీజన్స్ పేర్కొనడం స్పీకర్ ఫార్మెట్‌కు విరుద్ధం.
 
ఇదంతా చూస్తుంటే ఉపఎన్నికలు రాకుండా చేసేందుకు రెండు పార్టీల (బిజెపి, వైఎస్సార్ కాంగ్రెస్) ఉమ్మడి కుట్రలో భాగమేననేది ఎవరికైనా తెలిసి పోతోంది. బిజెపి పట్ల, వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందునే ఈ రెండు పార్టీలు కూడబలుక్కుని రాజీడ్రామా ఆడుతున్నాయి. వైకాపా ఎంపీల రీ-కన్ఫర్మేషన్ లెటర్స్‌లో రీజన్స్ ప్రస్తావించారనేది, అది ఫార్మెట్ కాదనేది ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్ధం అయ్యింది. రాజీనామాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, చిత్తశుద్ధితో ఇచ్చారని, వ్యక్తిగతంగా స్పీకర్ వెరిఫై చేసుకున్నాక, ఇన్ని నెలలు ఆమోదించడంలో ఎందుకని తాత్సారం చేస్తున్నారు..? ఉపఎన్నికలు రాకుండా చేయడం కోసమే ఈ తాత్సారం అంతా..? 2019లో ఎటూ ఓటమి తప్పదనేది ఈ రెండు పార్టీలకు ఇప్పటికే నిర్దారణ అయ్యింది. దానికి ముందే ఉపఎన్నికలు జరిగితే, వాటిలో ఘోరంగా ఓడిపోతే కేడర్ పేనిక్ అవుతుందనే భయంతోనే ఈ జాప్యం చేస్తున్నారు. ఈ నాటకం ఆడుతున్నారు.
 
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి, 5 కోట్ల ప్రజల హక్కులను కాపాడటానికి, పార్లమెంటు వేదికను కోల్పోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్దంగా లేదు. ఎందుకంటే మన ఎంపీల పోరాటానికి అదే సరైన వేదిక కాబట్టి." అని అన్నారు యనమల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద‌ర‌హో అనిపించ‌నున్న ఆంధ్రా వంట‌కాలు... బెజ‌వాడ‌లో ఏడు రోజులు...