Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసీపి టిక్కెట్ అడిగే దౌర్భాగ్యం పట్టలేదు: గల్లా అరుణకుమారి(Video)

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఎట్టకేలకు అలకపాన్పు దిగారు. గత కొన్నిరోజులుగా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఐదుగంటల పాటు హైడ్రామా నడిచిన తరువాత ఎట్టకేలకు చంద్రగిరి నియ

వైసీపి టిక్కెట్ అడిగే దౌర్భాగ్యం పట్టలేదు: గల్లా అరుణకుమారి(Video)
, గురువారం, 7 జూన్ 2018 (20:35 IST)
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఎట్టకేలకు అలకపాన్పు దిగారు. గత కొన్నిరోజులుగా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఐదుగంటల పాటు హైడ్రామా నడిచిన తరువాత ఎట్టకేలకు చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగేందుకు సమ్మతించారు గల్లా అరుణకుమారి. గల్లా నిర్ణయంతో ఆమె అనుచరుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. 
 
కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగాను, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం గల్లా అరుణకుమారికి ఉంది. తండ్రి రాజగోపాల నాయుడు కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చారు గల్లా అరుణకుమారి. గల్లా కుటుంబానికి చిత్తూరు జిల్లాలో ప్రత్యేక స్థానమే ఉంది. అటు పరిశ్రమలు, ఇటు ప్రజా సేవతో గల్లా కుటుంబం ముందుంటోంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు గల్లా అరుణకుమారి. 
 
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న గల్లా కుటుంబంలో పుట్టిన గల్లా అరుణకుమారికి చంద్రగిరి నియోజకవర్గంలో మంచి పట్టే ఉంది. గత ఎన్నికల్లో నమ్మినవారే నట్టేట ముంచేయడంతో గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చివరకు చంద్రగిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌గా కొనసాగారు. అయితే పార్టీలో గల్లా అరుణకుమారికి తగిన విలువ ఇవ్వకపోవడం, అధికార పార్టీలో ఉన్నా పదవి లేకుండా పోయింది. తనకు కావాల్సిన వారికి పనులు చేయించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు గల్లా అరుణకుమారి. 
 
దీంతో కొన్నినెలల పాటు అలకపాన్పు ఎక్కారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోను హాజరు కాలేదు. గత నెల రోజులకు ముందు ఏకంగా చంద్రగిరి టిడిపి ఇన్‌ఛార్జ్ పదవిలో కొనసాగనని అధినేత చంద్రబాబునాయుడుకే చెప్పేశారనే వాదన కూడా వచ్చింది. చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తరువాత విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారు గల్లా అరుణకుమారి. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో గల్లా కుటుంబం టచ్‌లో ఉందని, పలమనేరు నియోజకవర్గ టిక్కెట్‌ను గల్లా అరుణకుమారి ఆశిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అది తప్పని గల్లా కుటుంబం ఎక్కడా చెప్పలేదు. దీంతో నిజంగానే గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్‌లు ఇద్దరూ వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారని అందరూ అనుకున్నారు. 
 
చివరకు గల్లా అరుణకుమారి తన సన్నిహితులు, అనుచరులు, శ్రేయోభిలాషులు, టిడిపి కార్యకర్తలు, నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలోనే తాను కొనసాగుతానని, టిడిపిని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. తన తండ్రి తనకు ఒక లేఖ రాశారని, అది చాలా సంవత్సరాల తరువాత తన ఇంటిలో కనిపించిందని మీడియాకు చూపించారు గల్లా అరుణకుమారి. నువ్వు మంత్రివి అయితే ప్రజా సేవకే అంకితం కావాలి. ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకోవాలని తన తండ్రి తనకు ఒక లేఖ రాసినట్లు చూపించారు గల్లా అరుణ కుమారి. పూటకో పార్టీ మారడం తనకు తెలియదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది కాబట్టే తెలుగుదేశం పార్టీలో చేరామని చెప్పుకొచ్చారు గల్లా అరుణకుమారి. 
 
అయితే పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగలేనని చెప్పారు. దీంతో గల్లా అనుచరులందరూ ఒక్కసారిగా గందరగోళం సృష్టించారు. మీరే పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉండాలంటూ పట్టుబట్టారు. అరగంట పాటు హైడ్రామా నడిచిన తరువాత ఎట్టకేలకు చంద్రగిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌గా తానే కొనసాగుతానని చెప్పారు గల్లా అరుణకుమారి. దీంతో టిడిపి నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పడంతో ఆమె అనుచరుల ఆనందానికి అవధ్లుల్లేకుండా పోయింది. చూడండి వీడియోలో ఆమె మాటలు...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్.. కాపాడండి - వైఎస్. జగన్‌ను కలిసిన రమణ దీక్షితులు