Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెల రోజుల్లో మోదీ సర్కారు గడగడలాడే కుంభకోణం బయటపెడతాం...

టిడిపికి బిజెపికి మధ్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఒకవైపు బిజెపి పార్టీ ఎయిర్ ఏషియా స్కామ్‌ను చూపించి టిడిపిని ఇరుకున పెట్టాలని చూస్తుంటే, మరోవైపు టిడిపి కూడా బిజెపికి జాతీయ స్థాయిలో నష్టాన్ని కలిగించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertiesment
C Kutumbarao sensational comments on NDA govt
, బుధవారం, 6 జూన్ 2018 (16:50 IST)
టిడిపికి బిజెపికి మధ్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఒకవైపు బిజెపి పార్టీ ఎయిర్ ఏషియా స్కామ్‌ను చూపించి టిడిపిని ఇరుకున పెట్టాలని చూస్తుంటే, మరోవైపు టిడిపి కూడా బిజెపికి జాతీయ స్థాయిలో నష్టాన్ని కలిగించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు అతిపెద్ద కుంభకోణాలను త్వరలోనే బయటపెట్టబోతున్నట్లు టిడిపి వెల్లడించింది.
 
రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు సి. కుటుంబరావు మంగళవారం నాడు సిఎం క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ బిజెపి కుట్రపూరితంగానే ఎయిర్ ఏషియా స్కామ్‌లో టిడిపిని ఇరికించాలని చూస్తోందని, దీనికి టిడిపి ఏమాత్రం భయపడదని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ ఏషియా అధిపతి, సిఇఓ ఫోన్‌లో మాట్లాడుకుంటుంటే చంద్రబాబును ఇందులో ఇరికించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
 
అంతేకాకుండా నెలరోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించే రెండు అతిపెద్ద కుంభకోణాలను బయట పెట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుల వ్యాపార సంస్థకు చేసిన ఉపకారం ఉందని, దానిపై తాము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముహూర్త సమయానికి పెళ్లికూతురు జంప్.. బంధువులమ్మాయితో?