Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా కల్లోలం: 12 మందికి పాజిటివ్

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (20:22 IST)
శ్రీహరి కోటలోని షార్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి వచ్చారు. అలా ఊరెళ్లి వచ్చిన వారు మళ్లీ ఉద్యోగ విధుల్లోకి రావాలంటే పరీక్షలను షార్ అధికారులు తప్పనిసరి చేశారు. ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్‌కు పంపారు. 
 
సూళ్లూరుపేటలోని ఉద్యోగుల కాలనీల్లో పరీక్షలను ముమ్మరం చేశారు. ముందస్తు అనుమతితోనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని.. వచ్చిన తర్వాత తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. తర్వాతే విధులకు హాజరు కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
 
బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లు వాడాలని వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు షార్ ఉన్నతాధికారులు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల చివరి వారంలో జరగాల్సిన రీ శాట్ ప్రయోగం వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments