Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక తిరుపతి విష్ణు నివాసంలో కోవిడ్ కేర్ సెంటర్

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (22:11 IST)
దేశ స్థాయిలో కరోనా పేషెంట్లకు మెరుగైన సేవలు అందించడంలో తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం ప్రత్యేక గుర్తింపును సాధించిందని తుడ వీసీ హరికృష్ణ అన్నారు. ఇక్కడ సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నయని తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటి వరకు 25 వేల మందికి కోవిడ్  సేవలు అందించిన కోవిడ్ కేర్ సెంటర్ గా గుర్తింపును సాధించినట్లు వెల్లడించారు. టిటిడి, తుడ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక అధికారిని, తుడ సెక్రటరీ లక్ష్మీ కృషి ఎనలేనిదని కొనియాడారు.

శ్రీపద్మావతి నిలయంలో కోవిడ్ సేవలు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం కోవిడ్ వారియర్ వీడ్కోలు సభ  ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా తుడ విసి హరికృష్ణ, ఎంపిపి మోహిత్ రెడ్డి విచ్చేశారు.
 
తుడ వీసీ హరికృష్ణ మాట్లాడుతూ..  శ్రీ పద్మావతి  నిలయంలో  అధిక శాతం శానిటరీ వర్కర్స్ నుండి డాక్టర్ల వరకు ఆడపడుచులే ఎక్కువగా ఉన్నారన్నారు. అందుకే దేశంలోనే గొప్ప పేరు సాధించేందుకు సాకారమైందని తెలిపారు. ఇక్కడ అందించిన ఆహారం వల్ల  కోవిడ్  బాధితులు కోలుకొని, ఇమ్యునిటీతో ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారని అన్నారు. ఇక్కడ కరోనా సేవలు పొందిన వారిలో ఇంగ్లాండ్, నార్త్ ఇండియన్స్ ఉన్నట్లు వెల్లడించారు. తుడా చైర్మన్ ప్రత్యెక శ్రద్ధ చూపి మొదటి వేవ్ లో బాధితులకు నగదు అందించిన అంశాన్ని గుర్తుచేశారు.
 
ఎంపిపి మోహిత్ రెడ్డి  మాట్లాడుతూ.. మరోసారి   కోవిడ్ రాకుడదని భగవంతుణ్ణి కోరారు. తుడా సెక్రెటరీ లక్ష్మీ గారు.. ఇక్కడ  సేవలు అందిస్తే.. భర్త రాజశేఖర్  స్విమ్స్ లో సేవలు అందించారన్నారు..  కుటుంబ సభ్యులుగా పని చేసి కరోనా పేషంట్ల ప్రశంసలు పొందారన్నారు.  అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన టిటిడి, జిల్లా కలెక్టర్, సిబ్బందికి ఎమ్మెల్యే చెవిరెడ్డి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 
 
తుడా సెక్రటరీ  స్వాగతోపన్యాసం చేశారు. మొదటి వేవ్ మార్చి 2020 నుండి ప్రారంభం అయిందని, గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల మొదటి వేవ్ లో 15 వేలు, రెండవ వేవ్ లో 11 వేలకు పైగా కోవిడ్ బాధితులు ఇక్కడ సేవలు పొందారు.

ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం, టిటిడి, రాస్, మెడికల్ డిపార్ట్మెంట్ సహకారంతో మంచి పేరు సాధ్యమైందన్నారు.  శ్రీ పద్మావతి నిలయం లో పనిచేసిన ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ బృహత్తర కార్యక్రమం  చేపట్టారన్నారు. వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

డిప్యుటీ కలెక్టర్ శ్రీనివాసులు, డిఎంహెచ్ఓ శ్రీహరి, 
డిప్యూటీ డిఎంహెచ్ఓ రవిరాజు, సెట్విన్ సి.ఇ.ఓ.మురళీ కృష్ణ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కోవిడ్ కేర్ సెంటర్ లో తమవంతు సేవలందించిన డాక్టర్లను, సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments