Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (08:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. గత 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె నిబంధనలు ఉల్లంఘించారంటూ బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ జారీ చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27వ తేదీన ఉషశ్రీ చరణ్‌పై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. 
 
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తాహసీల్దారు డీసీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీంతో సెక్షన్ 188 కింద ఉషశ్రీతో పాటు మరో ఏడుగిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు నిందితులు పదేపదే హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments