గుప్త నిధుల కోసం సొంత తమ్ముడు కుమారుడినే...

హైటెక్ ప్రపంచంలో కూడా మూఢనమ్మకాలను కొంతమంది విశ్వసిస్తున్నారు. ఫలితంగా గుప్త నిధుల పేరుతో సాటి మనుషులనే బలిస్తున్నారు. తాజాగా గుప్త నిధుల కోసం సొంత తమ్ముడి కుమారుడినే బలిచ్చే ప్రయత్నం చేశారు. ఆలస్యంగా

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (10:48 IST)
హైటెక్ ప్రపంచంలో కూడా మూఢనమ్మకాలను కొంతమంది విశ్వసిస్తున్నారు. ఫలితంగా గుప్త నిధుల పేరుతో సాటి మనుషులనే బలిస్తున్నారు. తాజాగా గుప్త నిధుల కోసం సొంత తమ్ముడి కుమారుడినే బలిచ్చే ప్రయత్నం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఖానాపూర్‌ మండలం బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలోని రంగపేట గ్రామానికి చెందిన గోనె లచ్చన్న - లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ఎదురుకాళ్లతో జన్మించిన చిన్న కుమారుడు మహేశ్‌(13) ఉన్నాడు. లచ్చన సోదరుడు (అన్న) లింగన్న గత 15 రోజుల క్రితం తమ్ముడిని కలిశాడు. ఎదురుకాళ్లతో ఉన్న నీ కుమారుడు మహేశ్‌ను తమకు ఇస్తే తమకు వచ్చే దాంట్లో నీకు సగం బంగారం ఇస్తానని నమ్మపలికాడు. 
 
వచ్చే దాంతో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చని ఆశచూపాడు. దీంతో ఆందోళనకు గురైన మహేశ్‌ తల్లి లక్ష్మి తానేందుకు కుమారున్ని ఇస్తానని వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జరిగి 15 రోజులైంది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తన కుమారుడికి ప్రాణభయం ఉందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై గోగికారి ప్రసాద్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments