Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఏడడుగులు... పోలీస్‌స్టేషన్‌కు పరుగులు...

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:18 IST)
వారిద్దరి భాషలు వేరైనా మనసులు కలిసి పెళ్లి చేసుకుందామని అనుకున్నా పెద్దలు ఒప్పుకోలేదు. చేసేది లేక పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని రక్షణ కావాలంటూ నూజివీడు పోలీస్​లను ఆశ్రయించారు.

రాష్ట్రాలు వేరైనా...భాషలు వేరైనా వారిద్దరి మనసులు కలిశాయి. ఇద్దరు కలిసి జీవించాలనుకొని పెద్దలు ఎదురించి పెళ్లి చేసుకున్నారు..అనంతరం తమకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆ జంటే ఆంధ్రాకు చెందిన ప్రవీణ్- కేరళకు చెందిన హైమ.

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణం హాజరయ్యపేటకు చెందిన ప్రవీణ్​కుమార్, త్రివేండ్రానికి చెందిన హైమా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే వారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి, పెళ్లి వరకు వెళ్లింది. యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పినా ఒప్పుకోకుండా మరొకరితే వివాహం చేయాలని ప్రయత్నించారు.

ఇష్టపడి ఇద్దరూ ఎలాగైనా పెళ్లి చేసుకోవలని అనుకొని... బాపులపాడు మండలం కాలమోలు గ్రామంలో రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. రక్షణ కల్పించాలని నూజివీడు పోలీసులను ఆశ్రయించారు.

కుమార్తె తప్పిపోయిందంటూ యువతి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న త్రివేండ్రం పోలీసులు... నూజివీడు వచ్చి విచారించారు. హైమాకు, ప్రవీణ్​కు వివాహం జరిగిన విషయం తెలుసుకొని వివరాలు నమోదు చేసుకొని వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments