Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఫ్యానుకు ఉరేసుకున్న భర్త...

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:30 IST)
ఇటీవలి కాలంలో భార్య వేధింపుల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్న భర్తల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారిలో ఎక్కువ మంది విద్యావంతులు, ఉద్యోగులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, ఓ బ్యాంకు ఉద్యోగి.. తన భార్యతో వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాగ్‌హాట్ జిల్లా తెలిసిల్లాబర్రాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలిసిల్లాబర్రాకు చెందిన పంకజ్‌ బీసీన్‌(32) చిత్తూరు జిల్లా సోమల కార్పొరేషన్‌ బ్యాంకులో అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఆర్నెల్ల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన కిరణ్‌ కుమారితో వివాహం జరిగింది. ఆమె అక్కడే ప్రభుత్వ వైద్యశాలలో స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తోంది. 
 
అయితే, ఇంతలో భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, బుధవారం రాత్రి భార్యకు వీడియోకాల్‌ చేసి మాట్లాడిన పంకజ్‌ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. ఆమె వెంటనే విషయాన్ని సోమలలోని పంకజ్‌ సహచర ఉద్యోగులకు ఫోన్‌ ద్వారా తెలిపింది. 
 
వారు అక్కడికి చేరుకునేటప్పటికే పంకజ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టగా అప్పటికే పంకజ్‌ మృతి చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments