Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో లక్షణాలు లేకుండా కరోనా వ్యాప్తి.. 18-45 వాళ్లనీ కోవిడ్ వదలట్లేదు..

Webdunia
సోమవారం, 6 జులై 2020 (11:39 IST)
కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కరోనా కేసులు 20 వేలను దాటాయి. సగటున రెండు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వెయ్యికి చేరువ అవుతోంది. మరణాలు కూడా రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ప్రజలు సైతం ఎన్ని రోజులు బయటకు వెళ్లకుండా ఉంటామన్న నిర్లక్ష్యంతో ఉండడం కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. 
 
కరోనా లక్షణాలు ఏవీ బయట పడకుండానే చాలా మందికి వ్యాధి రావడంతో పాటు లోపల ఉన్న శరీర భాగాలు అన్ని దెబ్బ తింటున్నాయి. చివరకు వారు మరణిస్తున్నారు. ఈ లక్షణాలు ఎక్కువుగా ఏపీ ప్రజల్లోనే కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.
 
అంతేగాకుండా 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వున్న వారికే ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో ఇప్పటివరకు చిన్నారులను, వృద్ధులకు మాత్రమే సులభంగా కరోనా సోకుతుందనుకునే వారికి షాక్ తప్పలేదు. 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల లోపు వారికి కరోనా సులభంగా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఇంకా లక్షణాలు కనిపించని వారికి ఇన్ఫెక్షన్‌ కారణంగా శరీర భాగాలేమైనా దెబ్బతినే అవకాశం ఉందని కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్వాసకోస, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.
 
మరి కొందరికి మాత్రం డయేరియా, తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా ఏ మాత్రం అలసట, జ్వరం, ఒళ్లంతా నొప్పులు ఉన్నా కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments