Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో అతి భయంకర ప్లేగు వ్యాధి.. చైనాలో 2 కేసులు నమోదు!

Advertiesment
మరో అతి భయంకర ప్లేగు వ్యాధి.. చైనాలో 2 కేసులు నమోదు!
, సోమవారం, 6 జులై 2020 (11:27 IST)
ఇప్పటికే ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న ఈ వైరస్.. దాదాపు 220 ప్రపంచ దేశాలకు వ్యాపించి, అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం వణికిపోతున్నాయి. ఈ వైరస్ నుంచి ఎలా బయటపడాలో తెలియక తల్లడిల్లిపోతున్నాయి. ఇంతలోనే మరో వ్యాధి ప్రపంచాన్ని కబళించనుందట. 
 
ఈ ప్లేగు వ్యాధి మంగోలియా దేశంలో పురుడు పోసుకుందట. దానిపేరు బుబోనిక్ ప్లేగు వ్యాధి. 19వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధితో పోలిస్తే, ఇది మరింత బలమైనదని చెబుతూ నగరంలో మూడో స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ సంవత్సరం చివరి వరకూ ఈ హెచ్చరికలు అమలులో ఉంటాయని తెలిపారు.
 
కాగా, కోరనా వైరస్ దెబ్బకు ప్రపంచ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంగోలియా దేశంలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని చైనాలోని బయాన్నూర్ నగర అధికారులు హెచ్చరించారు. 
 
మంగోలియాలో బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకుతోందని వెల్లడించారు. శనివారం నాడు తూర్పు చైనా ప్రాంతంలోని మంగోలియా పరిధిలో అనుమానిత బుబోనిక్ ప్లేగు కేసులు రెండు వచ్చాయని స్థానిక హెల్త్ కమిషన్ వెబ్ సైట్ పేర్కొంది. 
 
మర్మోట్ (పందికొక్కు) మాంసం తినడం వల్ల వీరికి ఈ వ్యాధి వచ్చినట్టు గుర్తించారు. దీంతో వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేట్ చేశారు. ఈ వ్యాధి మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంత నిర్లక్ష్యమా..? కరోనా రోగుల మృతదేహాల్ని కుక్కలు పీక్కుతింటున్నాయ్..!