Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ లేకున్నా వ్యాక్సిన్ వేసుకోవచ్చు .. ఎక్కడ?

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (16:52 IST)
కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు పదేపదే కోరుతున్నారు. అయితే, చాలా మంది ఏవేవో కుంటి సాకులతో ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వృద్ధులకు ఆధార్ కార్డు లేకున్నప్పటికీ వ్యాక్సిన్ వేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. 
 
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు వివరాలను ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అలాగే, కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇందుకోసం 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు పేర్కొంది. 
 
ఇప్పటివరకు 1955 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సుమారు 1300 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. థర్డ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ కాలేదని, అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments