Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్క్ ధరించి వచ్చే కస్టమర్లకు జరిమానా.. ఎక్కడో తెలుసా?

Advertiesment
California Cafe
, సోమవారం, 7 జూన్ 2021 (12:36 IST)
కరోనా వైరస్ కాటుకు జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగలేదు. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా మాస్కు ధరించడం తప్పనిసరి అయింది. ఈ మేరకు ప్రభుత్వాలు రూల్ కూడా తెచ్చాయి. మాస్క్ ధరించకుంటే మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి. 
 
అయితే .. మాస్కు ధరిస్తే ఫైన్ విధించే నిబంధన వుంది. ఎక్కడో తెలుసా అమెరికాలో. అమెరికా దేశంలోని కాలిఫోర్నియాలో ఫిడిల్‌హెడ్స్ కేఫ్ విస్తుపోయే నిబంధన అమలు చేస్తోంది. మాస్క్ ధరించి వచ్చే కస్టమర్లకు జరిమానా వేస్తోంది. బిల్లుపై అదనంగా 5 డాలర్లు వడ్డిస్తోంది. అంతేకాదు.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాం అని గొప్పగా చెప్పుకోవడం కూడా తప్పే. అలాంటి వారికి కూడా ఫైన్ వేస్తారు.
 
నిజానికి అమెరికాలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాకున్నా ముందుజాగ్రత్త చర్యగా కొందరు, భయంతో మరికొందరు మాస్కులు ధరిస్తున్నారు. చాలామంది వినియోగదారులు జరిమానా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు కానీ, మాస్క్‌ తీసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. కాగా, ఇలా జరిమానాల రూపంలో వసూలైన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తామని కేఫ్ యజమాని క్రిస్ కాస్టిల్‌మ్యాన్ తెలిపారు.
 
ఈ కేఫ్‌కు వచ్చే కస్టమర్లలో చాలామంది.. ఈ నిబంధనను స్వాగతిస్తున్నారు. జరిమానా చెల్లించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జరిమానా రూపంలో తామిచ్చే డబ్బు అలా అయినా స్వచ్చంధ సంస్థలకు చేరుతుందని, నిస్సహాయులకు ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం ఈటల రాజేందర్‌!