ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఇంకా లభించలేదు. నేరుగా స్పీకర్‌ను కలిసి తన రాజీనామా ఇవ్వాలని ఈటల భావిస్తున్నారు.
అయితే కరోనా కారణంగా కలిసేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వన్నట్లు సమాచారం. కరోనా తగ్గితే సమాచారం ఇస్తామని ఈటలకు స్పీకర్ కార్యాలయం సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అపాయింట్‌మెంట్ ఇవ్వని పక్షంలో ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పంపే యోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను ఈటల ఫోన్‌లో కోరినట్లు తెలుస్తోంది.
అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా తాను బయటకు రావడం లేదని, రాజీనామా లేఖను తన కార్యాలయంలో అందజేయాలని స్పీకర్ సూచించినట్లు సమాచారం.