Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా చావాలంటే కొబ్బరి నూనెను తలకు రాయాలట..!

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:01 IST)
కరోనా వచ్చి ఉంటామో పోతామో తెలియని స్థితిలో జనాలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ సమయంలో కొబ్బరినూనె రాసి ప్రార్థనలు చేస్తే కరోనా నయమవుతుందంటూ ఓ ముఠా కొవిడ్ వార్డులో ప్రచారానికి దిగింది. కొవిడ్ పేషెంట్లను సైతం వదలకుండా ఈ ముఠా చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ కొవిడ్ వార్డుల్లో మత ప్రచారం జోరుగా సాగుతోంది. కొబ్బరినూనెను తలకు రాసి ఓ ముఠా ప్రార్థనలు చేస్తోంది. ప్రార్థనతో వ్యాధి నయం అవుతుందని హితోక్తులు చెబుతోంది. ఆసుపత్రి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా మత ప్రచారం సాగుతోంది. 
 
జనరల్, సర్జికల్ వార్డుల్లోనూ కొబ్బరి నూనె రాస్తూ సదరు ముఠా ప్రార్థనలు నిర్వహిస్తోంది. రాత్రి వేళల్లోనూ యథేచ్ఛగా మత ప్రచారం నిర్వహిస్తూ కొందరు మహిళలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వార్డుల్లోకి రాకూడదని ఆస్పత్రి సిబ్బంది వారించినప్పటికీ... వినకుండా బెదిరిస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments