Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులకు కరోనా

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (09:30 IST)
కృష్ణాజిల్లా దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది దివిసీమలో విద్యార్థుల చదువుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. స్కూల్స్ తెరిచారనే ఆనందం ఒకవైపు, కరోణ దరికి చేరుతుందనే భయం మరోవైపు విద్యార్థులను వెంటాడుతున్నాయి.

పాఠశాల తెరిచి 15 రోజులు గడవక ముందే ఐదుగురు విద్యార్థులు కరోనా బారిన పడటం దివిసీమలో విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తుంది.

నాలుగు రోజుల క్రితం నాగాయలంక మండలం భావదేవరపల్లి ఎంపీపీ స్కూల్ లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకగా ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే కోడూరు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఒక విద్యార్థికి మోపిదేవి మండల పరిధిలోని మెరకన పల్లి ఎంపీపీ స్కూల్ లో మరో విద్యార్థి కరోనా బారిన పడ్డారు.

అంతేకాకుండా చిన్నారులకు ఇంకా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకపోవడంతో  దివిసీమలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలా వద్దా అనే మీ మాంసలో ఉన్నారు. మరో నెలలో కరోణ మూడవ దశ వస్తుందనే వైద్యనిపుణుల ముందస్తు ప్రకటన సైతం విద్యార్థుల చదువులు పై ప్రభావం చూపుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 ADలో నటుడిగా రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్‌లో థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments