Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు' పూర్తి చేయండి: మంత్రి కురసాల కన్నబాబు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:10 IST)
రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు వ్యవసాయ, అనుబంధ సేవలు అందించడమే ప్రధాన అజెండగా పనిచేయాలని అధికారులను మంత్రి కుర‌సాల కన్నబాబు ఆదేశించారు.

వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు, ఆగ్రోస్ ఎండీ బాలాజీ పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఎరువులు, విత్తనాలు, రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు అందిస్తున్న సేవలపై మంత్రి ఆరా తీశారు.

నెల్లూరు జిల్లాలో పంట ఉత్పత్తుల కొనుగోలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి కన్నబాబు ఆదేశించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో సానుకూలంగా స్పందించాలని సూచించారు.

ఈ క్రాప్ బుకింగ్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనపై జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్‌ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు నిర్ణీత సమయంలో పూర్తి చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments