Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవలన్నింటికీ ఒకే పోర్టల్

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (14:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలన్నింటికీ ఒకే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ సేవ పేరుతో ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు పోర్టల్‌ను తీసుకొచ్చామని చెప్పారు. సిటిజెన్స్ సర్వీసెస్ పోర్టల్‌ను ప్రారంభించామని, దీనికి ఏపీ సేవ అనే పేరును పెట్టామని తెలిపారు. 
 
మారుమూల గ్రామాల్లో సైతం వేగంగా, పారదర్శకంగా అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలు పొందేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. మనకున్న వ్యవస్థను మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగానే ముందడుగు అని చెప్పారు. 
 
గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో అందరికీ తెలిసేనా గత రెండేళ్ళ కాలంలో అడుగులు ముందుకే వేశామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సేవలను అందించడంలో గ్రామ, వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రజల సేవలో 4 లక్షల మంది సిబ్బంది ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమైవున్నారని, గ్రామస్వరాజ్యానికి ఇంతకంటే నిదర్శనం లేదని సీఎం జగన్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments