Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.18 లక్షల విలువచేసే డ్రైఫ్రూట్స్ బొక్కేశారు...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (07:08 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ... ఇప్పటివరకు సచివాలయంలో అడుగుపెట్టలేదు. అయినప్పటికీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆయా శాఖల ఉన్నతాధికారులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు హాజరువుతున్నారు. 
 
ఈ సమీక్షల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా విద్యాశాఖలో సమీక్ష చేస్తున్న సమయంలో ఏపీ ఉన్నత విద్యామండలిలో జరిగిన ఓ తంతు బయటపడింది. ఈ శాఖలో పనిచేస్తున్న.. కేవలం నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత మూడేళ్లలో 18 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మాటలు విన్న జగన్ ఒకింత షాక్‌కు గురయ్యారు. 
 
ఇప్పటికే ఆర్థికశాఖలో జరిగిన అక్రమ కేటాయింపులపై ఓవైపు చర్చ జరుగుతుండగానే ఏపీ ఉన‌్నత విద్యామండలిలో జరిగిన ఈ పరిణామం తాజా ప్రభుత్వానికి విస్మయం కలిగించింది. అయితే ఈ మొత్తం అధికారిక కార్యక్రమాల సందర్భంగా వాడిన డ్రైఫ్రూట్స్‌కు ఖర్చు చేశారా? లేక సొంత అవసరాల కోసం వాడుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. 
 
రివ్యూల్లో గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించాలని సీఎం హోదాలో జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అక్రమాలు జరిగినట్టు తేలితే సీఎం చర్యలకు సిద్ధమయ్యే అవకాశాలు లేకపోలేదని సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments