Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి మహేష్‌కు ఏపీ సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం!

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (16:51 IST)
ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామచంద్రాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ ప్రస్తుతం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య సేవలకు భారీ ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్‌కు చికిత్స నిమిత్తం సీఎం జగన్ భారీ ఆర్థిక సాయం చేశారు వైద్య ఖర్చుల నిమిత్తం జగన్ సర్కార్ 17 లక్షల రూపాయల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. ఈ మేరకు అధికారికంగా సిఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖ విడుదల చేశారు. 
 
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల చెన్నై, నెల్లూరు ప్రధాన రహదారిలో కత్తి మహేష్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్‌ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. 
 
అక్కడే వారం రోజులుగా కత్తి మహేష్‌కు చికిత్స జరుగుతుంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం కుటుంబం మాత్రమే మహేష్ కత్తి హాస్పిటల్ ఖర్చులన్నీ భరిస్తూ వచ్చినట్లు అతడి మిత్రులు చెప్పారు. ఇన్స్యూరెన్స్ పాలసీలు క్లైమ్ చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ అధికారికంగా భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments